![]() |
| నేను చేసిన బాదం కోవా :) |
కూడా కలిపి బాదం కోవా చేస్తే తినడానికి చాలా బాగుంటుంది.
తయారు చేయడానికి కావలసినవి:-
అడుగు మందం ఉన్న వెడల్పు గిన్నె లేదా బాణలి (చాలా ముఖ్యం. పలుచగా ఉంటే మాడి పోగలదు.)
పాలు మనక్కావలసినన్ని తీసుకోవచ్చు. అరలీటరు పాలకు మూడు నాలుగు కోవా బిళ్ళలు రాగలవు అని గుర్తుంచుకొని తీసుకోవాలి.
చక్కెర అరలీటరు పాలకు రెండు పిడికిళ్ళు ప్రకారం తీసుకుంటే మరీ తీపి లేకుండా సరిగ్గా వస్తుంది. లేదంటారా మన రుచి ప్రకారం.
బాదం పొడి ఇది కూడా కావలసినంత. ఒక పిడికెడు నుంచి చూసి వేసుకోవచ్చు. (అంగళ్ళలో దొరుకుతున్నది. నేను ఎమ్ టీ ఆర్ బాదం పొడి వాడినాను.)
రెండు చెంచాల నెయ్యి.
తయారుచేసే విధానం:-
ముందుగా అడుగు మందం ఉన్న పాత్ర/బాణలిలో పాలన్నీ వేసి కాచాల.
పొంగు వచ్చాక మంట తగ్గించి అప్పుడప్పుడు చూసి కలుపుతూ ఉండాల.
పాలు నెమ్మదిగా కాగుతూ, మరుగుతూ ఉంటాయి. పొంగకుండా చూసుకోవాల .
సుమారు గంట ఉంచాక కొంచెం దగ్గర పడుతుండగా కొద్దికొద్దిగా బాదం పొడి చల్లుతూ కలుపుకోవాల.
బాగా కలిసిపోతుంది. ఏమీ ఉంటలు కట్టదు.
తరువాత చక్కెర వేసి కలుపుతూ మాడకుండా చూసుకోవాల.
మధ్యలో రెండు చెంచాల నెయ్యి కూడా వేసుకోవాల.
బాగా రవ్వరవ్వగా ముద్దముద్దగా కంటికి కనపడుతుంటే దించుకోవడమే.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి