Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, జనవరి 2011, సోమవారం

మెంతికూర - వంకాయ పప్పు

కొన్ని కొన్ని భలే జంట కుదురుతాయి. అలాగే మెంతికూర , వంకాయ కూడా.
ఇవి రెండూ కలిపి పప్పు చేస్తే చాలాబాగుంటుంది.
మెంతికూర కూడా పచ్చిది కావాలనేం లేదు. ఎండుమెంతికూర అయితే చాలు.
కసూరీ మేతీ అని దొరుకుతుంది చూడండి. అది కూడా వేసుకోవచ్చు.

మెంతికూర కొత్తిమీర లాగే చిన్న కట్టలు, పెద్దకట్టలుగా దొరుకుతుంది.
మెంతికూర చిన్న కట్టలు అసలు సగం మెంతి ఆకు ఉన్నట్టు ఉండవు. నేను పెద్ద మెంతికూర కట్టలే తీసుకుంటాను.
అంతా ఒకేసారి ఖర్చవదు. అసలు మెంతి కూర ఎక్కువ వేస్తే చేదు వస్తుంది.
ఇక మిగిలిన ఆకు అంతా చక్కగా విడదీసి ఎండబెట్టి కాగితంలో చుట్టి పెట్టుకుంటే పాడవకుండా ఎన్ని రోజులైనా ఉంటుంది.

మెంతికూర ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇప్పుడు నేను కొత్తగా చెప్పక్ఖర్లేదు.
కావలసినవేమేం ఉన్నాయో చూద్దామా!

  1. ముందుగా కందిపప్పు ఉడికించి పెట్టుకోవాలి. దీనికి కొలతలు ఎందుకు? మామూలుగా ఇంట్లో అందరికీ పప్పెంత చేయాలో తెలుసుకదా!
  2. మెంతికూర - ఒక గుప్పెడు ( నలుగురికి పప్పు వండుతుంటే ఇది చాలు. ఎక్కువైతే చేదు అవుతుంది.)
  3. వంకాయలు - ఒక గుప్పెడు ముక్కలు ( ఏమిటీ ఇలా చెపుతుంది అనుకోకండి, ముక్కలు మరీ ఎక్కువైతే బాగుండదు.
  4. మిరప్పొడి - కాస్త ఎక్కువేసుకుంటేనే బాగుంటుంది.
  5. ఉప్పు - తగినంత
  6. చింతపండు రసం - ఓ రెండు చెంచాలు
  7. పసుపు - చిటికెడు
  8. తిరగవాత కు మరికాస్త నూనె, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు, మరికాస్త ఇంగువ.
ఇప్పుడు తయారు చేసే పద్ధతి చెపుతాను.
  • కందిపప్పు మెత్త్త గా ఉడికించి పెట్టుకోవాలి.
  • వేరొక గిన్నెలో వంకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి.
  • వంకాయ ముక్కలు కొంచెం ఉడికాక , ఎండు మెంతికూర కడిగి వేయాలి.
  • రెండూ బాగా ఉడికాక, ఉడికిన కందిపప్పు వేయాలి.
  • బాగా కలిపి, చింతపండు రసం, ఎండు మిరప్పొడి, ఉప్పు, పసుపు వేయాలి.
  • మంట తగ్గించి , అప్పుడప్పుడూ కలియబెడుతూ 5 నిముషాలు ఉడకనివ్వాలి. (మూత పెట్టి)
  • తిరగవాత పెట్టి దించేయాలి.
వేడి వేడి అన్నంలో కలుపుకొని చక్కగా నెయ్యి వేసుకొని తింటుంటే , ఉంటుందీ..ఆహాఁ....
స్వర్గమే!

4 కామెంట్‌లు:

  1. వేంకటేశ్వరరావు గారు,
    ధన్యవాదాలండి. ఈ పప్పు మీకు నచ్చినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  2. నేను మెంతికూర ఎప్పుడూ వాడలేదు కానీ అలసందగింజలతో ఇలాగే చేస్తాను. బాగుంటుంది

    రిప్లయితొలగించండి

ప్రముఖ పోస్ట్‌లు