ఈ పులుసు మా అమ్మ స్పెషల్. చాలా త్వరగా చేయొచ్చు. పైగా ఎంతో రుచిగా ఉంటుంది. ఆ మాట మేం చెప్పాలి అంటారా? సరే, తప్పకుండా చెపుతారని నాకు తెలుసు.లేకపోతే మనసులో చెప్పుకుని ఉంటారులే అనుకుంటాను. హ..హ...హా..
కావలసిన పదార్థాలు:
టమాటాలు : 2
ఉల్లిగడ్డలు : 1(పెద్దది)
ధనియాలు : ఒకటిన్నర స్పూన్
ఎండు కొబ్బెర :ఒక గుప్పెడు
కారప్పొడి : తగినంత
ఉప్పు : తగినంత
చక్కెర : కొద్దిగా
నూనె : 2 టీ స్పూన్లు
తాలింపు గింజలు
పసుపు : చిటికెడు
తయారీ విధానం:
ముందుగా మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి నూనె వేసి తాలింపు గింజలు వేసి అవి వేగాక కడిగి పెట్టిన టమాటాలు తరగకుండా అలాగే వేసి స్టవ్ తగ్గించి, గిన్నెకు మూత పేట్టాలి. అప్పుడప్పుడూ గిన్నెను జాగ్రత్తగా కదుపుతూ ఉంటే ఒక 5 నిముషాల్లో టమాటాలు మెత్తబడతాయి. అప్పుడు మూత తీసి వాటిని మెత్తగ గరిటతో కుమ్మి తగినన్ని నీళ్ళు పోసి మరగనివ్వాలి. ఈలోగా ధనియాలు, కొబ్బెర మిక్సీలో వేసి, పొడి చేసుకుని,పెద్దగ తరిగిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి.(ఉల్లిగడ్డ పూర్తిగా నలగకూడదు.) టమాటాలు బాగా కలిసిపోయి, నీళ్ళు మరిగాక ఉప్పు, కారప్పొడి, పసుపు, చక్కెర వేసి, మిక్సీలో వేసిన దాన్నీ వేసేయలి. ఒక 5 నిముషాలు స్టవ్ మీద ఉంచి,కరివేపాకు మాత్రం వేసుకుంటే చాలు.
టమాటా పులుసు తయారు!
ఇది అన్నంలోకి బావుంటుంది.
టమాట పులుపు చాలని చింతపండు చెప్పలేదు.

మీరు రాసింది చదివితే ఓసారి ప్రయత్నించాలనిపిస్తోంది..
రిప్లయితొలగించండిమురళి గారూ!
రిప్లయితొలగించండితప్పకుండా ప్రయత్నించండి మరి. ధన్యవాదాలు.
ఉల్లి గడ్డలా?
రిప్లయితొలగించండినో...నో....కుదరదంతే.
మనం తినకపోతే సరి. :)
తొలగించండి