Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, ఫిబ్రవరి 2011, బుధవారం

పచ్చికొబ్బరి కూర

పచ్చికొబ్బరి కూర

ఇప్పుడే పాకవేదంలో చూశాను. కొబ్బరికూర గురించి.
మేమింకో విధంగా చేస్తాం కదా సరే రాద్దాం అనిపించింది. ఇది చాలా రుచిగా ఉంటుంది. రెండవ రోజు కూడా ఏమీ కాదు.
అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది. వేరే ఏదైనా కలుపుకున్నప్పుడు నంజుకోవటానికి కూడా బాగుంటుంది.

కావలసిన పదార్థాలు :
  1. పచ్చి కొబ్బరి తురిమి ఉంచుకోవాలి.
  2. పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టు చిన్నచిన్నముక్కలుగా తరిగి ఉంచుకోవాలి.
  3. పచ్చి కరివేపాకులు
  4. కొత్తిమీర
  5. ఉల్లిపాయలు చిన్నగా తరిగి ఉంచుకోవాలి. (ఇష్టం లేకపోతే మానేయ వచ్చు.)
  6. {ఇష్టమైతే వెల్లుల్లి వేసుకోవచ్చు , నేను వేయను కాబట్టి వ్రాయను.}
  7. నూనె తగినంత
  8. తిరగవాత గింజలు (అంటే ఆవాలు, మినపబేడలు, శనగబేడలు, ఎండుమిరపకాయలు)
  9. ఉప్పు

తయారుచేసే పద్ధతి :
  • ముందుగా బాణలి పొయ్యి మీద పెట్టి నూనె వేయాలి.
  • తిరగవాత గింజలు వేయాలి.
  • తరువాత పచ్చిమిరప, ఉల్లి, కరివేపాకు,కొత్తిమీర అన్నీ వేసి,వెంటనే పొయ్యి తగ్గించి, ఉప్పు వేసి తురిమి ఉంచుకున్న పచ్చి కొబ్బరి వేయాలి.
  • బాగా కలిపి రెండు నిముషాలు ఉంచి దించాలి.
  • అంతే కూర తయారు.

ఇప్పుడు కొన్ని సూచనలు.

  1. ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకండి. నూనెలోనే వెంటనే వేగిపోతుంది కొబ్బరి.
  2. ఎక్కువ కొబ్బరి మిగిలినప్పుడు ఇలా చేసి మరుసటి రోజు వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చు.

3 కామెంట్‌లు:

ప్రముఖ పోస్ట్‌లు