Loading...

మంగళవారం 3 ఫిబ్రవరి 2009

మరమరాలతో ఉప్మా- (బొరుగులు)

మా ఊరి వైపు మరమరాలని బొరుగులని అంటాం. అందుకే అలా రాశాను.
దీన్ని బొరుగుల తిరగవాత అనీ, ఉగ్గాణి అనీ అంటారు. ఆఫీసుకు వెళ్ళే తొందర లో
ఉండే వాళ్లకు త్వరగా పని తెములుతుంది.
చకా చకా అయిదు నిమిషాల్లో చేసేయొచ్చు.
వేడిగా తింటే బాగుంటుంది.
దీనికీ, పచ్చిమిరపకాయలతో చేసే బజ్జీలు మంచి జోడి అన్నమాట. బజ్జీలు అంటే పుగ్యాలు.
ఉగ్గాణి పుగ్యాలు ఇక్కడి వాళ్లకు ఫేవరేట్ డిష్, తెలుసా!
ఇక విషయానికి వస్తే,
కావలసిన పదార్థాలు:
బొరుగులు (అందాజుగా -ఒక దోసిలి నిండా అయితే ఒకరికి ఒక సారి ప్లేట్ లో వేసి ఇవ్వొచ్చు.
దీన్ని బట్టి ఎంత కావాలో చూసుకుని తీసుకొవచ్చు)
పచ్చిమిరపకాయలు - రెండు (ఒకరికి )
ఉల్లి గడ్డలు - ఒకటి
కారట్ -ఒకటి
టమాటో - ఒకటి
కరివేపాకు -ఒక రెబ్బ
కొత్తిమిర - ఒక రెబ్బ
పచ్చి కొబ్బరి|
తురుము | -రెండు స్పూన్లు
పుట్నాల పప్పు,ఎండు కొబ్బరి కలిపి మిక్సీలో వేసి పెట్టుకున్నది- రెండు స్ప్పూన్లు.
నూనె - ఒక చిన్న గరిటెడు
సెనగపప్పు - ఒక టీ స్పూన్
ఆవాలు - అర టి స్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత

చేసే విధానం:
ముందుగా బొరుగులని నీళ్ళలో వేసి తడిపి వెంటనే పిండేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
కూరగాయలన్నీ ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద మందపాటి బాణలి, లేదా గిన్నె పెట్టాలి.
అందులో నూనె వేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడేక,
పసుపు,సెనగపప్పు, కూర ముక్కలు వేసి ఒకసారి వేగనిచ్చి,
ఉప్పు వేసి, ఇందాక తడిపి ఉంచిన బొరుగులని వేసి,
మూతపెట్టాలి . స్టవ్ సిమ్ లో ఉంచాలి.
ఒక రెండు నిముషాలాగి, మూత తెరిచి ,చక్కగా కలిపి,
స్టవ్ మీదనుంచి దించాలి. ఇప్పుడు పుట్నాలు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీలో వేసిన పొడి,
పచ్చి కొబ్బరి, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
అంతే! వేడి వేడి బొరుగుల తిరగవాత రెడి!

గమనిక:. కారట్, టమాటో, పచ్చి కొబ్బరి లేకపోయినా చేసుకోవచ్చు.
. నిమ్మ కాయ కావాలంటే ఒక డిప్ప పిండుకోవచ్చు.

7 వ్యాఖ్యలు:

Jahnavi చెప్పారు...

mandakini garu ee tiffin chala tondaraga aipotundi peddaga kashta padakkarledu kooda
chala thanka

మందాకిని చెప్పారు...

జాహ్నవి గారూ!
ధన్యవాదాలు.సిస్టం మొండికేయడంతో మీ వ్యాఖ్యని చూడలేదు.మన్నించండి. అన్నట్టు మీ పేరంటే నాకు చాలా..... ఇష్టం తెలుసా!

హర్షోల్లాసం చెప్పారు...

avunu ee vanta ma anantapur-attagaru maa imtiki vacchinappudu cheesaru asala super telusaaa:-)

మందాకిని చెప్పారు...

హర్షోల్లాసం గారూ!
చూశారా, మీరు మీ అత్తగారితో నేర్చుకోలేదనే నేను ఈ వంటను పరిచయం చేశా!! హ హ హ!!

sunny చెప్పారు...

Mandakini garu,
mana ananthapur vantalanu andariki parichayam chestunnaduku thanks.

Sunil

sunny చెప్పారు...

hi,
mana ananthapur vantalanu andariki parichaym chestunnaduku chala thanks andi

sunil

మందాకిని చెప్పారు...

సునీల్ గారూ!
మన రాయలసీమ వంటల గొప్పతనం అందరికి తెలియాలికదామరి!

ప్రముఖ పోస్ట్‌లు