Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, జనవరి 2009, ఆదివారం

గోంగూర పప్పు-(మసాలా)

మా అత్తగారు గోంగూర పప్పు చక్కగా రుచిగా చేస్తారు. ఆవిడ వంటలన్నీ చక్కగా చేస్తారు. ఇక గోంగూర పప్పు ఐతే చెప్పక్ఖర్లేదు. మా బంధు వర్గం అంతా మెచ్చుకుంటారు. ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కూడా మెచ్చుకుంటారు.ఇప్పుడు వయసయింది. వంట చేయకుండా ఉరికే ఉండటం ఆవిడకు బొత్తిగా తోచడం లేదట. ఫోన్ చేసినప్పుడు చెబుతూ ఉంటారు. సరే, ఇకవిషయానికి వస్తాను. ఇవాళ ఆవిడ చేసే గోంగూర పప్పు గురించి చెప్పబోతున్నాను.
గోంగూర పప్పు -(మసాలా)
కావలసిన పదార్దాలు:
కందిపప్పు (ఉడికించి పెట్టుకోవాలి)
గోంగూర (కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి)
చింతపండు -కొద్దిగా
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
నూనె, తాలింపు గింజలు
మసాలాకు కావలిసినవి:
ధనియాలు -ఒక టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి - ఒక పెద్ద ముక్క
పచ్చిమిరపకాయలు- కారానికి తగినంత
వెల్లుల్లి- ఏడెనిమిది పాయలు
చేసే విధానం:
ధనియాల్ని నూనె లేకుండా వేయించి ఎండుకొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిరపకాయల్నీ కలిపి మిక్సీ లో వేసుకొని పెట్టుకోవాలి.
ఉడికిన పప్పులో తరిగిన గోంగూర, రుబ్బిన మసాలా, వేసి కాసేపు ఉడకనివ్వాలి. అడుగంటకుండా చూసుకోవాలి.
చింతపండు రసం, ఉప్పు, పసుపు వేయాలి.
బాగా మెత్తగా ఉడికి కలిసిపోయేవరకు ఉంచి దించాలి. (మెత్తగా ఉడకకపోతే బాగుండదు)
ఇప్పుడు తాలింపు వెయ్యాలి. మరి కాస్త నూనె వేస్తేనే రుచిగా ఉంటుంది.
పైన కూడా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయించి వేసుకోవచ్చు .
అన్నంలో కలుపుకున్నప్పుడు బాగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది.

2 కామెంట్‌లు:

ప్రముఖ పోస్ట్‌లు