Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, ఆగస్టు 2012, శుక్రవారం

రవలడ్డు


కావలసిన వస్తువులు:
౧.బొంబాయిరవ  ఒక గిన్నె
౨.పచ్చికొబ్బెర     ఒక గిన్నె
౩.చక్కెర            రెండు గిన్నెలు
౪.నెయ్యి           సగం గిన్నె
౫.యాలక్కాయపొడి కొద్దిగా

చేయవలసిన పద్ధతి:

ముందుగా రవ, కొబ్బెర తురిమినది సమానంగా తీసుకొని చిన్న సెగ మీద నెయ్యి వేసి నిదానంగా వేయించాల. రెండూ కలిపే వేయించాల.
ఇంకా ఎక్కువ చెయ్యాలనుకున్నా కూడా రెండిటినీ కొద్దికొద్దిగా తీసుకొని కలిపి వేయించాల.  ఎఱ్ఱ బడకుండా వేయించుకొని పక్కకు పెట్టుకోవాల.
చక్కెరను కొంచెం నీళ్ళతో తడిపి పొయ్యి మీద పెట్టాల.
ఉండపాకం వస్తూనే రవ , కొబ్బెర మిశ్రమాన్ని మెల్లమెల్లగా పాకంలో వేస్తూ కలియబెట్టాల.
తొందరగానే కలిసిపోయి నీళ్ళశాతం ఆవిరయిపోతుంది.
యాలక్కాయపొడి వేసి బాగా కలిపి దించాలి.
వేడి మీద లడ్లు కట్టేయాలి.
కొంచెం గాలి తగులుతుండగానే పొడిపొడిగా అయిపోతుంది కాబట్టి ఉండలుగా రాదు. అట్ల రాకపోతే ఒక చుక్క పాలు వేసి కలిపి కట్టుకోవచ్చు. వేడి మీద కడితే పాల అవసరం ఉండదు.
గమనిక:
౧.చక్కెరలో నీళ్ళు కొంచెం ఎక్కువ ఐతే లడ్లు ముద్దముద్ద గా ఉంటాయి. తక్కువ అయితే మరీ పొడిపొడిగా అయి పాలు లేకపోతే కట్టడం కష్టం అయిపోతుంది. కాబట్టి నీళ్ళు చూసి సరిగ్గా వేసుకోవాలి.
౨.పాకంలో రవ, కొబ్బెర ఉడికి ఉండడం వలన కమ్మగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతూ రుచిగా ఉంటుంది.
౩.దీనికి గోడంబి అదే జీడిపప్పు నాకంతగా నచ్చదు. కావలిస్తే వేసుకోవచ్చు.

ప్రముఖ పోస్ట్‌లు