ఉన్నట్టుండి తీపి తినాలనిపించినా కూడా టక్కున చేసేసుకొనే తీపి వంటలు మనకెన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఈ పెసర ఉంటలు. అంటే పెసరబేడలతో లడ్లన్నమాట.నిముషాల్లో అయిపోయేదీ, నిలవ ఉండటంలో వెనకాడనిదీ ఈ తీపి వంటకం. పది పదిహైదు రోజులున్నా తాజాగా ఉంటుంది. పది పదహైదుగురు పిల్లలున్నచోట అయితే ఫట్ మని అయిపోయేదీ ఈ తీపి వంటకం.
కావలసిన పదార్థాలు:-
పెసరబేడలు (ఎన్నో)
బెల్లం లేదా చక్కెర (అంతే )
అంటే సమానంగా అనమాట.
జీడిపప్పు
ఏలకుల పొడి
నెయ్యి పట్టినంత
తయారు చేసే విధానం :-
ముందుగా పెసరబేడలను కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాల. రంగు మారుతూ ఉండగానే కమ్మని వాసన వస్తుంది. సన్నని మంట మీద ఓపిక గా వేయించుకుంటే ఎఱ్ఱబడకుండా, మాడకుండా దించేయవచ్చు.
కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాల.
వేయించిన పెసరబేడలను పొడి చేసుకున్నాక బెల్లం లేదా చక్కెర ను, జీడిపప్పు ను, ఏలకుల పొడిని కలిపి విసరుకోవాల. అదే మిక్సీలో తిప్పుకోవాల.
పూర్తి మెత్తగా వేస్తే అంగిటికి అతుక్కుంటుంది. మరీ నూక గా కూడా వేయకూడదు. చూసి పొడి చేసుకోవాల.
ఈ మిశ్రమాన్ని గిన్నెలో కి తీసుకొని కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టుకోవాల.
ఉండకట్టడానికి కావలసినంత నెయ్యి పోస్తే బాగుంటుంది. తక్కువైతే ఉండ విడిపోతుంది. ఎక్కువైతే మరీ బాగుండదు.
పైన కావాలంటే జీడిపప్పు పలుకులు అతికించుకోవచ్చు. అవి అడ్డంఅనుకుంటే మానేయవచ్చు.
గమనిక- చక్కెరకన్నా బెల్లంతోనే మంచి రుచి వస్తుంది.