ఆకుకూరల్లో మెంతికూర ఎంత మంచిదో అందరికీ తెలిసిన సంగతే. స్త్రీలకు, మధుమేహరోగులకు మరీ మంచిది.
ఈ మెంతికూర సరిగ్గా చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఎవ్వరూ వద్దనరు. ఇంక వంకాయతో కలిపి పప్పులో వేస్తే ఆ రుచే వేరు. అద్భుతంగా ఉంటుంది. ఈ బ్లాగులోనే వంకాయమెంతికూర పప్పుకు వచ్చినన్ని హిట్లు మరి దేనికీ రాలేదు.
ఇప్పుడు మెంతి కూరను కూరగా ఎట్ల చేయాలో చూద్దాం
కావలసిన పదార్థాలుః-
చేసేవిధానం:-

- పెద్ద మెంతికూర కట్ట - ఆకులు దూసి కడిగి తరిగి పెట్టుకోవాల.
- కందిపప్పు - ఒక పిడికెడు
- ఉప్పు -తగినంత
- కారప్పొడి -తగినంత (బాగానే పడుతుంది)
- పసుపు -చిటికెడు
- నూనె -అర్ధ గరిటెడు
- ఎండు కొబ్బెర పొడి (పచ్చి కొబ్బెర బాగా ఎండినది ఇంట్లో ఉన్నా వాడుకోవచ్చు.)
- తిరగవాతకు ఆవాలు, ఎండుమిరపకాయలు, మినపబేడలు, శెనగబేడలు , ఇంగువ
చేసేవిధానం:-
- ముందుగా కందిబేడలను ఉడికించి పెట్టుకోవాల.
- బాణట్లో నూనె వేసి తిరగవాత వేసి వేగనిచ్చి తరిగిన మెంతికూర వేసి సిమ్ చేసి మూతపెట్టాల.
- మెంతికూర మగ్గేలోపు ఉడికి చల్లగైన కందిబేడలను నీరు లేకుండా గట్టిగా పిండేసి పెట్టుకోవాల.
- ఐదు నిముషాలలోపే మెంతి కూర మగ్గి ఉంటుంది. దాంట్లో గట్టిగా పిండి పెట్టుకున్న కందిబేడలను వేసి కలిపి కారంపొడి వేసి మూతపెట్టి ఉంచాల.
- ఐదు నిముషాలయినాక దాంట్లో ఉప్పు , కొబ్బెరపొడి వేసి బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టి ఉంచాల.
- బాగా బాగా పొడిపొడిగా కూర వచ్చినాక దింపేయాల.
- ఈ కూర అన్నంలో కలుపుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.