Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, జనవరి 2009, శనివారం

చెట్నీ పొడి


అందరికీ నమస్కారం.నా మిగతా బ్లాగుల్ని ఆదరించినట్టే ఈ బ్లాగుని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ.... 

మేము మామూలుగా చేసుకునేవే ఇక్కడ రాస్తాను. కాబట్టి ఎవ్వరూ భయపడక్ఖర్లేదోచ్!!
మొట్టమొదటగా చెట్నీ పొడి రాస్తాను.  
చెట్నీ పొడి: 
కావలసిన పదార్థాలు- 
2 కప్పుల సెనగపప్పు 
11/2 కప్పుల మినప్పప్పు 
1/2 కప్పు ధనియాలు  
ఎండుమిరపకాయలు తగినంత
1 కప్పు ఎండు కొబ్బెర
2 చెంచాల జిలకర
చింతపండు తగినంత  
బెల్లము తగినంత  
ఉప్పు తగినంత  
1 గరిటెడు నూనె (మనం వాడేది)  
2 ఇంగువపొడి
చేసే విధానం-  
  • ముందుగా పప్పుల్నీ , ధనియాల్నీ బాణలిలో వేయించుకోవాలి.
  • తర్వాత కొద్దిగా నూనె వేసి మిరపకాయల్ని వేయించి, ఎండు కొబ్బెరని వేడి చేయాలి.
  • తర్వాత గరిటెడు నూనె బాణట్లో వేసి నాలుగు ఆవగింజలు వేసి అవి చిటపట్లాడేక, చింతపండు అందులో వేసి, వెంటనే మెల్లగా గరిటతో తీసి ఇంకో గరిట సహాయంతో నూనె కారిపోయేలా నొక్కెయ్యాలి.  
  • ఇప్పుడు పప్పుల్నీ, కొబ్బెర, మిరపకాయల్నీ కలిపి కొంచెం బరకగా పొడి చెసుకోవాలి.
  • అందులో నూనె నొక్కెయ్యగా గట్టిపడిన చింతపండునీ, బెల్లాన్నీ, ఉప్పుని వేసి పొడిచేయాలి.
  • పొడి మరీ గంధంలా కాకుండా చూసుకోండేం..  
  • అప్పుడే అయిపోయిందనుకున్నారో పప్పులో కాలేసినట్లే .హి..హి..హి  
  • ఆపొడిని బాణట్లో ఇంగువ వేగిన గోరువెచ్చని గరిటెడు నూనెలొ వేసి బాగా కలిపి ఒక సీసాలో వేసి మూసిపెట్టండి. 
  • చెట్నీ పొడి తయార్.
ఈపొడి 15 రోజులైనా తాజా గా ఉంటుంది (నీళ్ళవీ పొయ్యకుంటేనే సుమా.) 
మా ఇంట్లో అయితే 4 రోజుల్లో అవగొట్టేస్తాం. అంతరుచిగా ఉంటుంది. 
కొసమెరుపు: ఇది అన్నంలోకీ, చపాతీకీ , దోసెకీ పూరీకీ ఉప్మాకీ అన్నింటికీ బాగుంటుంది.
ఇంకా సాయంకాలం బొరుగులు(మరమరాలు) చెట్నీపొడి, కొంచెం నెయ్యి కలిపి తింటే చాలా బాగుంటుంది. 
  • గమనించండి-- 
  • ఉప్పు,చింతపండు,బెల్లం ఎవరి రుచి కి తగినంత వాళ్ళు వేసుకుంటే బాగుంటుందని కొలతలు చెప్పలేదు. 
  • ఎండుకొబ్బెర తగ్గించారో రుచి చెడుతుంది.
  • మిరపకాయలు మాఊరివైపు బ్యాడిగి మిరపకాయలని దొరుకుతాయి. అవి అయితే10,12వేయొచ్చు, కారముండవు, రుచి,ఎర్రటి రంగు బాగా వస్తుంది. కారంవైతే తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే ఇది పులుపు, తీపి కలిపిన వంటకం కదా !

6 కామెంట్‌లు:

  1. ఇప్పుడే ఈ పొడి గురించి మావిడతో చెప్పాను. రుచిగా వుంటే తింటాను..

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు మాస్టారూ!
    మీ భార్య గారు రుచిగా చేస్తారు చూడండి.

    రిప్లయితొలగించండి
  3. Hi mandaakinii
    chatnipodi lo memu dhaniyaalu veyyamu

    iisaari vesi chustaanu :)

    nijam cheppaalante ii podi enta tinnaa inkaa

    tinaalanipinchedi!!

    reddigaarU AlOchinchanakkaraledu

    cheyincheyandi mee avidato :)

    రిప్లయితొలగించండి
  4. శక్తి గారూ!
    ధనియాలు వెయ్యరా? వేసి చూడండి. బావుంటుంది.
    మా అబ్బాయి మీ లాగే. ఎంత తిన్నా బావుంటుంది అంటాడు.
    మీ వంటలు బావున్నాయి. అబ్బ ఎన్ని రకాలు!!

    రిప్లయితొలగించండి
  5. ధనియాలు వేశారుగా
    మేము నువ్వులు కూడా వేస్తాము
    మరింత రుచికోసం
    మా అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ పంపుతాను
    కొరియర్ లో ఇప్పటికీ 👌👌

    రిప్లయితొలగించండి

ప్రముఖ పోస్ట్‌లు