నాకు చాలా ఇష్టమైన టిఫిన్లలో తపిలెంటు ఒకటి. ఖంగారు పడకండి. బియ్యప్పిండి తో చేసే రొట్టేనే మేము తపిలెంటు అని అంటాము. దీనిమీద నెయ్యి లేదా వెన్న వేసుకుని తింటుంటే ఎంత బాగుంటుందో!
జిహ్వకో రుచి అన్నారంటే ఊరకే అన్నారా!
తపిలెంటు కి పదార్థాలు:
బియ్యప్పిండి - ఒక పెద్ద గరిటెడు ఒక రొట్టెకు
ఉప్పు -తగినంత
పచ్చి కొబ్బరి - తగినంత
పచ్చి మిర్చి -తగినంత
కారట్ తురుము - 1/2 కప్పు
ఉల్లిపాయలు -1/2 కప్పు(సన్నగ తరిగినది)
కరివేపాకు -1/4కప్పు(సన్నగ తరిగినది)
కొత్తిమీర -1/4కప్పు(సన్నగ తరిగినది)
చేయు విధానం:-
ముందుగ మిర్చి, కొబ్బరి మిక్సిలో వేసి పెట్టుకోవాలి.
బియ్యప్పిండిలో మిర్చి, కొబ్బరి మిశ్రమము, తరిగిన ఉల్లిపాయలు,కరివేపాకు, కొత్తిమీర, కారట్ తురుము ఉప్పు వేసి కొంచెంగా నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి.
ఇది చపాతి పిండి కన్నా కొంచెం నీళ్ళు ఎక్కువ పడుతుంది, బజ్జీల పిండి కన్న తక్కువ నీళ్ళు పడుతుంది.
ఇప్పుడు మందపాటి బాణలి కానీ, పెన్నం కానీ తీసుకోవాలి.
అందులో ఒక చిన్న గరిటెడు నూనె వేసి, తయారుగా ఉన్న పిండి ముద్ద జామకాయంత పరిమాణంలో తీసుకుని, మెల్లగా వేళ్ళతో వత్తుతూ బాణలి అంతా రొట్టె వచ్చేటట్టుగా వత్తాలి.
ఇప్పుడు బాణలిని స్టవ్ మీద పెట్టి పట్టకారుతో కానీ, చేతిగుడ్డతో గాని బాణలిని చుట్టూ తిప్పుతూ కాల్చుకుంటూ రావాలి.
కాలిన తర్వాత ఒకపెద్ద స్పూన్ తో లేపితే తేలికగా వచ్చేస్తుంది.
తిప్పి కాల్చాల్సిన అవసరం లేదు.
గమనిక:1 .ఎంత పల్చగా వత్తుకుంటే అంత కరకర లాడుతూ బావుంటుంది.
2 . పెద్దవాళ్ళు నమలలేరనుకుంటే మందంగా వత్తితే, మెత్తగా ఉంటుంది.
౩. బియ్యప్పిండి కొన్నది కాకుండా, ఇంట్లో కడిగి నీడలో ఆరబొసిన బియ్యాన్ని
మిల్లులో ఆడిస్తే రుచి ఎంతో బావుంటుంది.
౪. కూరగాయలు లేకపోయినా చేసుకోవచ్చు. చెట్నీ తో తినవచ్చు.
![]() |
| చిన్న కొబ్బెర ముక్కలు, పప్పులు (వేయించిన శనగపప్పు అని), వట్టి కారం మాత్రం వేసి చేసినదీ భలే ఉంటుంది గరగర గా) |
![]() |
| ఇది ఉల్లి, మిర్చి, కీరా, కారట్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ. |