Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, మార్చి 2009, శనివారం

మామిడిపళ్ళతో సీకర్ణి

మామిడిపళ్ళ కాలం రాబోతోందిగా! మామిడిపళ్ళు ఊరికే తినడమే కాక వాటితో ఒక సైడ్ డిష్ కూడా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చెపుతాను. నెను కొలతలు ఇవ్వటం లేదు. మనం తీపు ఎలా తింటామో చూసి చేసుకుంటే సరిపోతుంది.
మామిడి పళ్ళతో సీకర్ణి
కావల్సిన పదార్థాలు:
బాగా పండిన మామిడి పళ్ళు
బెల్లంపొడి మెత్తగా దంచినది
ఏలకుల పొడి


మామిడి పళ్ళు శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి.
పై తొక్క తీసివేసి గుజ్జంతా చక్కగా ఒక గిన్నె లోకి తీసుకోవాలి.
అందులో బెల్లంపొడి కలపాలి.
ఇష్టమైతే ఏలకుల పొడి వేసి కలపాలి.
ఒక ఐదు నిముషాలు అలా ఉంచితే చక్కగా కలిసి తినడానికి తయారుగా ఉంటుంది.
ఇది పూరీలలోకీ, చపాతీలలోకీ, దోశెల్లోకీ చాలా బాగుంటుంది.
ఇంకా భక్ష్యాల్లోకీ బాగుంటుంది.
అంతే కాదు కప్పులో వేసుకుని అలాగే తీసుకోవచ్చు కూడా.
గమనిక-:
1. మామిడిపళ్ళు బాగా కండ, రసం ఉండేలా చూసుకోవాలి.
2. పళ్ళ తీపిని బట్టి బెల్లం అందాజుగా వేసుకోవాలి.

5 కామెంట్‌లు:

  1. సికర్ణా?
    మేము దీన్ని సంస్కృతీకరించి శ్రీకరిణి అంటామే! ఏది కరెక్టో ఏమో!

    రిప్లయితొలగించండి

ప్రముఖ పోస్ట్‌లు