Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, ఏప్రిల్ 2009, మంగళవారం

మామిడి కాయతో బిసి ఉప్పిన కాయి.

ఇప్పుడు మామిడి కాయల కాలం. మార్కెట్ లో మామిడి కాయను చూస్తే కొనాలని ఉంటుంది. పప్పు, పచ్చడి కాక ఇంకేం చేస్తారో తెలీక కొనరు చాలామంది.
మాఊరి వైపు మామిడి కాయతో బిసి ఉప్పినకాయ చేస్తారు. బిసి ఉప్పిన కాయి కన్నడ పదం. దీనికి అర్థం వేడి ఊరగాయ అని. అంటే స్టవ్ మీద చేసుకుని వెంటనే తిన గలం గదా! అందుకే ఆ పేరు.
కావలసిన పదార్థాలు :
1.మామిడి కాయ - 1
2.ఆవాలు -2 టీ స్పూన్లు
3.మెంతులు -1 1/2 టీ స్పూన్లు
4.నూనె - తగినంత
5.తాలింపుకు ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి
6.కారప్పొడి - రెండు టీ స్పూన్లు
7.ఉప్పు - తగినంత
8.బెల్లం - చిన్న జామకాయంత

చేసే విధానం:

ముందుగా ఆవాలు, మెంతులని ఒకసారే బాణట్లో వేసి నూనె లేకుండా వేయించుకోవాలి.
వాటిని మెత్తగా పొడి చేసి ఉంచుకోవాలి.
ఇప్పుడు బాణలి స్టవ్ మీద పెట్టి,మరికాస్త నూనె వేసి తాలింపు గింజలు వేయలి.
వెంటనే మామిడి ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
ముక్క మెత్త పడ్డాక కారప్పొడి, ఉప్పు, (అవాలు, మెంతుల) పొడి, బెల్లము వేసి బాగా కలిపి ఒక పది నిముషాలు మంట తగ్గించి ఉంచి దించేయాలి.
ఇప్పుడు ఇంగువ వేసి పైన తాలింపు పెడితే, బిసి ఉప్పిన కాయి తయారు.
తియ్యగా, పుల్లగా బాగుంటుంది.
దీన్ని అన్నంతో తినొచ్చు.

గమనికలు:
1. మామిడి కాయ పులుపుని బట్టి, మన రుచిని బట్టి బెల్లం, (ఆవాలు, మెంతుల)పొడి కొలతలు పెంచుకోవచ్చు.
2. నూనె విషయంలో పిసినారి తనం చూపితే రుచి రాదు.
3.మరుసటి రోజుకి కూడా చెడకుండా ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు