Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, మే 2009, బుధవారం

ఉల్లి గోంగూర

ఉల్లి గోంగూర

గోంగూర పచ్చడి మీరు చెప్పేదేమిటి వంకాయ్! మాకు తెలుసు అనుకోవద్దు. సాధారణంగా గుంటూరోళ్ళు ఎండుమిర్చితో ఉల్లి లేకుండా చేస్తారుగదా! అందుకని ఉల్లిగడ్డతో చేసే పచ్చడి మా రాయలసీమదని డిసైడైపోయనన్నమాట.
ఇక గోంగూర మాత్రం తెలుగు వాళ్ళందరిదీనూ. మా వైపు గోంగూర పప్పుకు ప్రసిధ్ధి కదా!
(ఇక్కడా ప్రాంతీయ భేదాలేమిటని కోప్పడకండి సార్,ఏదో సరదాకి.)

పచ్చడికి కావలసిన పదార్థాలు:

బాగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు : ఒక గుప్పెడు
పెద్ద ఉల్లిగడ్డ : ఒకటి( పెద్ద ముక్కలు)
పచ్చిమిరపకాయలు : ఆరు
ఎల్లిపాయ :3 రెబ్బలు
ఉప్పు : తగినంత
నూనె : ఒక పెద్ద గరిటెడు
తాలింపు గింజలు :
ఆవాలు _ఒక చిన్న స్పూన్
మినప్పప్పు _ఒక స్పూన్
ఎండు మిరపకాయలు_రెండు
కరివేపాకు_ ఎండిపోయినా పర్లేదు
ఎల్లిపాయలు_ 4 ( ఐచ్చికం)

చేసే పధ్ధతి:

ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి ఒక చిన్న గరిటెడు నూనె వేసి,
అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ముక్కలూ వేసి వేయించాలి.
బాగా వేగాక ఎల్లిపాయలు,వేసి వేయించాలి.
అవి వేగాక గోంగూర వేసి మూత పెట్టాలి.
గోంగూర మెత్త పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి, ముక్కలు చల్లారాక
అన్నీ కలిపి రుబ్బుకోవాలి.
ఉప్పు వేయడం మరిచిపోకండి.
ఇప్పుడు మరి కాస్త నూనె వేసి తాలింపు పెడితే ఘుఘుమలాడుతూ పచ్చడి తయార్.

గమనిక:- 1. తాలింపులో గానీ, ముందుగాని ఎల్లిపాయ వద్దంటే మానేయొచ్చు.
2. ఇది 2,3 రోజులే ఉంటుంది కాబట్టి గోంగూర కొంచెం తడిగా ఉన్నా చేసేయొచ్చు.
3.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు