Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, జూన్ 2009, బుధవారం

మటిక్కాయ కూర

మటిక్కాయలు అంటే తెలుసుగా! గోరుచిక్కుళ్ళు అన్నమాట. మా వూళ్ళో వాటి పేరు మటిక్కాయలు.
చాలా మంది పచ్చికొబ్బెర వేసి ఈ కూర చేస్తారు. పిల్లలకు నచ్చటం కష్టం. పైగా చపాతీకి బాగుండదు. ఇప్పుడు నేను చెప్ప బోయేది చపాతీ కైనా అన్నానికైనా బాగుంటుంది.

కావలసిన పదార్థాలు:

మటిక్కాయలు - న్యాతవి (లేతవి)
పీచు తీస్తూ ముక్కలు చేసి ఉంచుకోవాలి.
పప్పులు (పుట్నాల పప్పు), ఎండు కొబ్బెర కలిపి పొడి చేసి ఉంచుకోవాలి.
కారప్పొడి, బెల్లం సమానంగా తీసుకోవాలి.
ఉప్పు, నూనె ,పసుపు, తిరగవాత గింజలు, నీళ్ళు సిద్ధం చేసుకోవాలి.

తయారు చేసే విధానం:
ముందుగా బాణలి స్టవ్ మీద పెట్టి, నూనె వేయాలి.
పసుపు, తిరగవాత గింజలు వేసి అవి వేగాక మటిక్కాయ ముక్కలు వేసి ,
కొంచెం నీళ్ళు పోసి ముక్కలు ఉడకనివ్వాలి.
ముక్కలు కొంచెం మెత్తపడ్డాక, బెల్లప్పొడి, కారప్పొడి వేసి బాగా కలిపి స్టవ్ మంట తగ్గించాలి.
కాస్సేపు మూత పెట్టి ఉంచాలి.
బెల్లం కరిగి ఆ నీళ్ళన్నీ ఆవిరి అయిందని, కారప్పొడి బాగా కలిసిందని నిర్ధారించుకున్నాక ఉప్పు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి.
ఒక 2 నిముషాలాగి పప్పులు, కొబ్బెర కలిపి దంచిన పొడి వేసి కలపాలి.
అంతే కమ్మటి కూర తయార్!

2 కామెంట్‌లు:

  1. నమస్తే మందకిని గారు __/\__

    సీమ వంటలు అధిరిపొయాయంటే నమ్మండి !!

    మరి నేనూ రాయలసీమ బిడ్డనుకదా అందుకేమో అన్నీ బాగా నచ్చేసాయి :)

    ఇకపోతే నేనూ మీరూ చేసే వంటలన్నీ ఒకేలా ఉండటం వింతనే !!!

    మరి నా BLOG ఒక సారి చూస్తారా మీకే తెలుస్తుంది :)

    మీరు రాయలసీమలో ఎక్కడవుండేది?

    ఇష్టమైతేనే చెప్పండి మీ అసలు పేరు?

    మరి నా BLOG లింక్ ఇస్తాను చూడండి :)

    www.animutyaalu.blogspot.com

    రిప్లయితొలగించండి
  2. నమస్తే శక్తిగారూ!
    నేను మీ పాటల బ్లాగ్ చూడకపోవటమేమిటండీ!
    తరచూ చూస్తూనే ఉంటాను. మంచి సేకరణ.
    ఇక మీ బ్లాగ్ చక్కగా అలంకరించబడి ఛాయాచిత్రాలతో ఆకర్షిస్తుంది. నేనేదో నాకు తెలిసిన రాయలసీమ వంటల్ని మాత్రం పరిచయం చేస్తున్నాను.
    ఇకపోతే నేనిప్పుడు రాయలసీమలో లేను. కానీ పుట్టి పెరిగిందీ, చదివిందీ, పెళ్ళాడిందీ మన రాయలసీమలోనే!
    మనిద్దరివంటలు ఒకేలా ఉన్నాయా?
    చూస్తాను. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి

ప్రముఖ పోస్ట్‌లు