Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, నవంబర్ 2010, ఆదివారం

శనగబేడల పరవాన్నం

శనగబేడల పరవాన్నం
కావలసిన పదార్థాలు: శనగ బేడలు - ఒక పిడికెడు తీసుకుంటే కప్పున్నర వస్తుందనుకుంటా. అందాజుగా చూసి
వేసుకోవడమే.
బియ్యం - ఒక చెంచా
బెల్లం - శనగ బేడలతో సమానంగా (ఎక్కువ తీపు తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ
వేసుకోవచ్చు.)
యాలక్కాయలు - ముగ్గురికి చేస్తే రెండు చాలు. పొడి చేసి ఉంచుకోవాలి.
బియ్యప్పిండి - రెండు చెంచాలు
ఎండు కొబ్బరితురుము - నాలుగు చెంచాలు ( చిన్న ముక్కలుగా కూడ వేసుకోవచ్చు.)
పాలు - సగం లోటా
జీడిపప్పు , ఎండు ద్రాక్ష - కావలసినన్ని.

చేసే విధానం :
* ముందుగా శనగ బేడలు ,బియ్యం కుక్కర్లో వేసి బాగా ఉడికించాలి. మూడు, నాలుగు విజిల్స్ వస్తే చాలు. చిదిపితే మెత్తగా చిదిగిపోతాయికానీ చూడడానికి విడివిడిగానే కనిపిస్తుంటాయి. కుక్కర్లో నీళ్ళు , బేడలు బాగా మునిగేవరకూ వేస్తే చాలు.
*కుక్కర్లోంచి బయటకు తీసి, ఆ నీళ్లతొనే అట్లే స్టవ్ మీద పెట్టాలి. మళ్ళీ ఉడకడం మొదలుపెట్టినప్పుడు దంచిన బెల్లం వేసి కలపాలి. బెల్లం కరుగుతూ ఉండగా, పాలు పోయాలి. జీడిపప్పు, ద్రాక్ష, యాలక్కాయ పొడి , కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. ఈ పరవాన్నం చాలా రుచిగా ఉంటుంది.

గమనికలు:
1. కొబ్బరి ముక్కలుగా వేసేట్టయితే బెల్లంతో పాటు వేయాలి.
2. కప్పుల్లొ వేసి రెండు చెంచాలు నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది.

2 కామెంట్‌లు:

  1. ఇందు, ధన్యవాదాలు.
    మీ చీమకథ వింటూ ,కొబ్బరన్నం తినేశాను. ఇలా చేస్తారని తెలీదు, ఏదో చిత్రాన్నంలో కొబ్బరి వేస్తారనుకున్నా. బాగుంది మీ అమ్మగారి వంట. నేనూ ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి

ప్రముఖ పోస్ట్‌లు