బెండకాయ/వంకాయ గొజ్జు
దీనికి తిరగవాత పెట్టటానికి మాత్రమే స్టవ్ అవసరం. అంటే దీన్ని తూర్పునాటోళ్ళు (అంటే కోస్తా వాళ్ళు అన్నమాట)
పచ్చిపులుసు అంటారనుకుంటా. ఇక ఈ వంటకం మేమెలా చేస్తామో చెపుతాను.
ఇది ముఖ్య ఆధరువు కాదు. చప్పని పప్పుకి గానీ, దద్ధోజనానికి గానీ, వఠ్ఠి పెరుగన్నానికి గానీ జోడీ గా బాగుంటుంది.
చప్పని పప్పు అంటే ఏమిటీ చెప్పని పప్పు అనేరు సుమా! గోంగూర పప్పు, మామిడికాయ పప్పు, టమేటొ పప్పు, ఆకుకూర పప్పు లాగా కూరలుగాని, కారం గానీ, చింతపండు గానీ లేకుండా కందిపప్పు మాత్రం ఉడికించి, ఉప్పు, పసుపు వేసి, అందులోకి చక్కగా కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, మినపగింజలతో పాటు ఇంగువ వేసి తిరగవాత బెట్టిన పప్పు అన్నమాట. ఇక ఈ బోనస్ వంటకం అయిపోయింది అసలు వంటకం లోకి వస్తామా?
కావలసిన పదార్థాలు: బెండకాయలు రెండు/ వంకాయ పెద్దది ఒకటి.
చింతపండు ఒక పెద్ద ఉసిరికాయంత
బెల్లము రుచిని బట్టి ( చింతపండు కన్నా ఎక్కువే పడుతుంది.)
ఉప్పు తగినంత
నువ్వులు ఓ రెండు పిడికిళ్ళు ( లేదా ఒక పిడికిలి నువ్వులు, మరో పిడికిలి బుడ్డపప్పులు వేసుకోవచ్చు)
పసుపు చిటికెడు
పచ్చిమిర్చి మూడు
ధనియాలు అర చెంచా
తిరగవాతకు:
నూనె రెండు చెంచాలు
జిలకర అర చెంచా
కరివేపాకు రెండు మూడాకులు
చేసే విధానం :
ముందుగా చింతపండు ఒక ఇరవై నిముషాలు నానబెట్టి రసం తీసి, ఒక పెద్ద లోటా నీళ్ళు కలపాలి. ఇందులోఉప్పు, మెత్తగా దంచిన బెల్లం వేసి కరగనివ్వాలి. ఈలోపు పచ్చినువ్వుల్ని ( వేయాలనుకుంటే బుడ్డపప్పుల్ని) పొడి చేసి, ఆపైన పచ్చి మిరపకాయల్ని, ధనియాల్ని కలిపి మిక్సీలో వేసి ఈ మిశ్రమాన్ని చింతపండు రసంలో కలపాలి. బెండకాయలు వేయాలంటే రెండు అంగుళాల ముక్కలుగా తరిగి, నూనెలో వేయించి గొజ్జులో కలపాలి. వంకాయలు వేయాలంటే, కాల్చి, తొక్క తీసి మెత్తగ పిసికి కలపాలి. ఆపైన తిరగవాత పెట్టుకోవాలి. ఓ అరగంట ముందే తయారుచేసిపెట్టుకుంటే భోజనాల వేళకి బాగుంటుంది.
గమనిక :
* బెండకాయలు గాని, వంకాయలు గాని వేయాలి. రెండూ వేయకూడదు.
* నువ్వులు తెల్లవైనా, నల్లవైనా మీ మీ ఇష్టం.
* విందులప్పుడు ఒక ఆధరవు, సులభంగా తయారయ్యేది.
31, అక్టోబర్ 2010, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ప్రముఖ పోస్ట్‌లు
-
మా ఊరి వైపు మరమరాలని బొరుగులని అంటాం. అందుకే అలా రాశాను. దీన్ని బొరుగుల తిరగవాత అనీ, ఉగ్గాణి అనీ అంటారు. ఆఫీసుకు వెళ్ళే తొందర లో ఉండే వాళ్లక...
-
కొన్ని కొన్ని భలే జంట కుదురుతాయి. అలాగే మెంతికూర , వంకాయ కూడా. ఇవి రెండూ కలిపి పప్పు చేస్తే చాలాబాగుంటుంది. మెంతికూర కూడా పచ్చిది కావాలన...
-
ఈ పులుసు మా అమ్మ స్పెషల్. చాలా త్వరగా చేయొచ్చు. పైగా ఎంతో రుచిగా ఉంటుంది. ఆ మాట మేం చెప్పాలి అంటారా? సరే, తప్పకుండా చెపుతారని నాకు తెలుసు.ల...
-
పాలకూర చెట్నీ (చివరాఖరికి బల్బ్ వెలిగింది!! పాత ఎడిటర్ కు మారిపోయాను. ఇప్పుడు టపా వేయగలిగాను.) కావలసిన పదార్థాలు పాలకూర ~ ఒక కట్ట ఉల్లిగడ...
-
వంకాయ పచ్చడి వంకాయ వంటి కూరయు.... అని పద్యాల్లో వినుతికెక్కిన వంకాయతో ఏవంట చేసినా అమోఘంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకని ఇప్పుడు వంకాయ...
-
మా సీమలో దోసకాయ అంటారు కానీ కొందరు కీర దోసకాయ అంటారనుకుంటా. అంటే చూడటానికి ఆకుపచ్చని గీతలో లేతాకుపచ్చ రంగులో బీరకాయకు తోబుట్టువు లాగా ఉంటు...
-
పచ్చికొబ్బరి కూర ఇప్పుడే పాకవేదం లో చూశాను. కొబ్బరికూర గురించి. మేమింకో విధంగా చేస్తాం కదా సరే రాద్దాం అనిపించింది. ఇది చాలా రుచిగా ఉంటు...
-
ఈ పేరు చూసి ఏమబ్బా ఇలా ఉంది అనుకుంటున్నారేమో. మా అవ్వ (నాన్నమ్మ) ఇలాగే అనేది. మా వూళ్ళో ఈ కూరకి ఇదే పేరు. మాండలీకాల్లో ఉన్న సొగసే వేరు. ఆ క...
-
ఉగాది పచ్చడి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. మేము చేసే ఉగాది పచ్చడి ఏమాత్రం భయపెట్టేదిగా ఉండదు. అదేంటో ఉగాది అనగానే ఎందుకలా కార్టూన్ లు వచ...
-
కావలసిన వస్తువులు: ౧.బొంబాయిరవ ఒక గిన్నె ౨.పచ్చికొబ్బెర ఒక గిన్నె ౩.చక్కెర రెండు గిన్నెలు ౪.నెయ్యి సగం గిన్న...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి