
వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుంటే ఆహాఁ.. అనకుండా ఉండలేనిది కొరివికారమే.
ఎఱ్ఱటి పండు మిరపకాయలు ఏమాత్రం కారం ఉండవు. రుచిగా ఉంటాయి.
(ఫోటోలు మరీ క్లోజప్ లో తీసినట్టున్నాను.😛)
పావు కేజీ పండుమిరపకాయలు కాస్సేపు నూనెలో మగ్గనిచ్చి, ఒక పిడికెడు (అందాజుగా) చింతపండు వాటిలో ఉంచేసి కాస్సేపు చల్లారనిచ్చి, ఉప్పు, ఆవాలు&మెంతులపొడితో పాటు మిక్సీలో వేసుకోవాలి.
పైన గరిటె నిండా నూనె, ఆవాలు, మినపబేడలు, మెంతి గింజలు, ఇంగువతో తిరగవాత పెట్టేస్తే సిద్ధమై పోతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి