Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, ఏప్రిల్ 2016, శుక్రవారం

మామిడికాయ చారు

అతి సర్వత్ర వర్జయేత్ - ఏదైనా మితంగానే ఆహారం తీసుకోవాలి. ఈ కాలంలో మామిడి ఎక్కువ దొరుకుతుంది. ఈ యేడు కొంచెం తక్కువగానే కన్పిస్తున్నాయనుకోండి.
మామిడి కాయలు, మామిడి పండ్లు చాలా ఇష్టంగా తింటాం.
మామిడి కాయతో పప్పు, రోటి పచ్చళ్ళు, నిలువ పచ్చళ్ళు, ఊరగాయలు మామూలే.
 మామిడి పండ్లు ఎక్కువ తింటే వేడి చేస్తుందంటారు గానీ, మామిడికాయ చలువ చేస్తుంది.

మామిడికాయ చారు లేదా రసం సులభంగా చేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది. ఎండలలో మనకు మంచిది కూడా.
 కావలసిన వస్తువులు--
మామిడికాయ
బెల్లం (కాయ ఎంతుందో అంత)
ఉప్పు కొద్దిగా
కారప్పొడి కొద్దిగా

చేసే పద్ధతి--
పొయ్యి మీద నీళ్ళు పెట్టి మరుగుతుండగా మామిడికాయ వేసుకొని ఉడికించుకోవాల.
(ఉడికిందంటే కాయ రంగు తగ్గుతుంది, నీళ్ళు సగమౌతాయి)
రెండు నిముషాలయినాక పొయ్యి మీద నుంచి దించుకోవాల.
 చల్లబడినాక అదే నీటిలో మామిడి కాయ చేత్తో చక్కగా పిసికి , తొక్క పడేయాల.ఆ నీటిలో ఉప్పు కారం, బెల్లం  కూడా వేసి తగినన్ని నీళ్ళు కలుపుకొని చల్లపెట్టెలో కాసేపుంచుకొని చల్లగా తాగొచ్చు.

౧. వడగట్టేయవద్దు. మామిడికాయ గుజ్జు మధ్యలో వస్తున్నా, తాగేయవచ్చు. బాగుంటుంది.
౨. పెద్ద మామిడికాయ అయితే ఒక కాయకు రెండు లోటాలు వస్తాయి.
౩. ఇష్టాన్ని బట్టి మామూలు చారు లా గా అన్నంలోనూ కలుపుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు