Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, జూన్ 2015, శనివారం

వంకాయ చెట్నీ (సులభంగా)

వంకాయతో పాటు మామూలుగా ఇంకాకొన్ని వేసి చెట్నీ అందరం చేస్తాం. ఉల్లిగడ్డలు, టమేటోలు, చింతపండు ఇలా...
ఇది కావాలంటే ఇక్కడ. http://seemavanta.blogspot.in/2010/05/blog-post.html
అవేమీ లేకుండా అద్భుతమైన రుచితో మరొక్కసారి కలుపుకొనే చెట్నీ అందరికీ నచ్చేది ఈ సులభతరమైన వంకాయ చెట్నీ.
కావలసిన పదార్థాలు-- లేత వంకాయలు
                                పచ్చిమిరపకాయలు తగినన్ని
             (వంకాయ సైజును బట్టి, మిరపకాయ కారాన్ని బట్టి, మన రుచిని బట్టి వేసుకోవాలని అర్థం. ఉదాః కు నాలుగు వంకాయలకు ఐదారు పచ్చిమిరపకాయలు.)
                              ఉప్పు.
                        తిరగవాత(తాలింపు) కు నూనె, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ (అన్నీకలిపి ఒక చెంచాలో వస్తే చాలు.)
అంతే. ఇంకేమీ లేదు.

చేసే విధానం---
ముందుగా వంకాయల్ని , పచ్చిమిరపకాయల్ని ఒకే ఒక్క చెంచా నూనె వేసి వేయించాలి.
ఇంక వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా తిప్పాలి.
ఇంగువ తిరగవాత పెట్టాల అంతే.
ఎంత బాగుంటుందో! తలచుకుంటే నోరూరిపోతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు