బుడ్డలు, చనక్కాయలు, వేరుశనక్కాయలు, పల్లీలు అన్నింటికీ అర్థం ఒకటే.
బుడ్డలు వలిచి విత్తనాలు తీస్కోవాల.
ఎన్ని అనేదేముంది? ముందుగా ప్రయత్నం చేస్కొనేటపుడు ఎవరైనా ఒక లోటాడు, లేదా ఒక్క చిన్న గిన్నెడు తీసుకుంటే మేలు. బాగా వచ్చిందంటే కొలతలు పెంచుకోవచ్చు.
ఏ కొలత లో బుడ్డల విత్తనాలు తీస్కున్నామో అదే గిన్నెడు బెల్లం మెత్తగా దంచినది తీసుకోండి.
కావలసిన పదార్థాలివే.
బుడ్డల విత్తనాలు, దంచిన బెల్లం, ఒక్క చెంచాడు నెయ్యి, కొంచెం నీళ్ళు అంతే.
చేసే విధానం
ముందుగా బుడ్డల విత్తనాలు ఉత్త బాణట్లో వేయించుకోవాల. ఏ జిడ్డూ అవసరం లేదు.
అయితే మాడకుండా చూసుకుంటూ వేయించుకోవాల. వాటిపైన పొట్టు కొంచెం కొంచెం నల్ల బడుతుంది కాదనను. కానీ మాడకూడదు. వేగిన బుడ్డల రుచి తెలిసిందే కదా! వేయించి అలవాటు లేదంటే మంచి వాసన వస్తుంది. గమనించండి. లేదా ఒకటిరెండు విత్తనాలు తీసి ఊది నోట్లో వేసుకొని తెలుసుకోండి.
తరువాత విత్తనాలు కొంచెం చల్లగయ్యే వరకూ ఉండి ఆ విత్తనాలను ఒక చాటలో పోసుకొని చపాతీ లట్టణికె (చపాతీ చేసే కట్టె/ అప్పడాల కర్ర) ను తీసుకొని బుడ్డల విత్తనాల మీదుగా కొంచెం వత్తిడి పెంచుతూ ఆడిస్తే పొట్టు అంతా వచ్చేస్తుంది. ఆ పొట్టు చెరిగేయండి పోతుంది. విత్తనాలు కూడా విడిపోతాయి రెండు ముక్కలుగా.
ఇప్పుడు దంచిన బెల్లంలో కొంచెం తడిసే వరకూ నీళ్ళు పోసి అంటే కొంచెమే చేతిలో పోసుకొని చేతితో కలిపితే చాలు.
పొయ్యిమీద పెట్టండి.
కలుపుతూ ఉండండి.వెంటనే బెల్లం కరిగి పాకం తయారవుతుంది. మరగడం మొదలుపెడుతూనే బుడ్డల విత్తనాలు వేసేసి కలపండి.
తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది.
ప్రక్కనే ఒక చెంచాడు నెయ్యి ముందే పూసి సిద్ధం చేసుకున్న తట్టలోకి వంపేయండి.
ఐదు నిముషాలుండి ముక్కలు గా తీసుకునేటట్టు చాకుతోనో సలాకితోనో గీసుకొని ఉంచుకోండి.
ఇంకో ఐదు నిముషాలుంటే బాగా గట్టిగా అయిపోతుంది.
అప్పుడు చేతితో ముక్కలు చేసుకుంటే సరిపోతుంది.
నీళ్ళు మాత్రం బెల్లంలో ఎక్కువపడకూడదు అంతే. సులభంగా చేస్కోవచ్చు.
మనకందరికీ తెలిసినట్టు బుడ్డల విత్తనాలు, బెల్లం రెండూ ఆరోగ్యానికెంతో మంచివి.
ఇంక జిడ్డేమీ లేదు- నెయ్యి, నూనె మాదిరి. కాబట్టి ఇంతకంటే రుచిగా, ఆరోగ్యమిచ్చేదిగా ఏ తీపుంటుంది?
కాలక్షేపానికి , సాయంకాలం పూట తినడానికి , ప్రయాణాల్లో తీస్కొనిపోడానికి మంచి చిరుతిండి ఇది.