Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, మార్చి 2012, గురువారం

జొన్నరొట్టె పై పద్యము

జొన్నలు పిండి చేయుదము, సోకుకిరీటము తీసి వంగ, నా
నున్నని మేను చీల్చెదము, నొవ్వక నాలుగు ముక్కలొప్పగన్
సన్నని యుల్లి, దంచిన మసాలలు కూర్చిక; జొన్నరొట్టెలో
వెన్నను పూసి తిందుమిక; వేడిన వారికి కొంత బెట్టుచున్.


వంగ ను + ఆ= వంకాయను 

3 కామెంట్‌లు:

  1. జొన్నల రొట్టెలఁ యందున
    మిన్నగు వంకాయకూర, మేలగు జోడీ
    వెన్నది మాత్రము వలదిక
    తన్నును మా వైద్యుడింక తథ్యము శ్యామా

    రిప్లయితొలగించండి
  2. జొన్నల రొట్టెలఁ యందున
    మిన్నగు వంకాయకూర, మేలగు జోడీ
    వెన్నది మాత్రము వలదిక
    తన్నును మా వైద్యుడింక తథ్యము శ్యామా

    రిప్లయితొలగించండి
  3. అందమైన కందం. వెన్నను వద్దంటే ఒప్పుకోవటం కష్టమేనండోయ్!
    అవునూ, పొద్దు కవి సమ్మేళనాల్లో తప్ప ఇంకెక్కడా కనిపించరేం పుష్యం గారు!
    జొన్నరొట్టె రప్పించింది. ధన్యవాదాలు.
    మీ బ్లాగ్ లో కూడా వ్రాయట్లేదా?

    రిప్లయితొలగించండి

ప్రముఖ పోస్ట్‌లు