Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, జులై 2011, బుధవారం

కూరల సూపము


ఏంటి పేరు అదోలా ఉంది అని చూస్తున్నారా? మరేం లేదు. సూపు అనటం విసుగేసి అలా రాశానన్నమాట.(ఈ పదము మన నిఘంటువు లోనిదే నండోయ్!) . కాదంటారా? సరే ,ఏదో ఈ సారికిలా కానిచ్చేద్దాం.


నేను ఇందులో టమాటాలు ఎక్కువ వేస్తానన్నమాట. ఎవరికేది ఎక్కువ కావాలంటే వాళ్ళు అది ఎక్కువ వేసుకోవచ్చు కదా!


సుమారు ఒక మూడు కప్పుల సూపము నకు --
కావలసిన పదార్థాలు :-
టమాటాలు నాలుగు/ఐదు
ఉల్లిగడ్డ ఒకటి (పెద్దది)
ఉర్లగడ్డ ఒకటి (పెద్దది)
కారట్ ఒకటి
అల్లం ఒక చిన్నముక్క
పచ్చిమిరపకాయలు రెండు
ఎల్లిపాయ ఒక పాయ
ఉప్పు ఒక చెంచా
చక్కెర ఒక చెంచా



చేసే పద్ధతి:-
* ముందుగా ఉల్లిగడ్డ పొట్టు వలిచేసి , ఉర్లగడ్డ, కారట్ లను పెద్ద ముక్కలుగా వేసుకోవచ్చు. మిగతావి అట్లాగే వేయవచ్చు.
* కూరలన్నీ కలిపి కుక్కర్ లో ఒక కూత వేసేదాకా ఉడికించాలి.
* నీళ్ళు కూరలు బాగా మునిగే దాకా వేయాలి. ఉడికాక నీళ్ళు పడేయకూడదు
* చల్లారాక కూరలు మాత్రమే నీళ్ళు లేకుండా తీసుకుని మిక్సీలో ఒకసారి తిప్పాలి.
* అంతా చక్కగా మెత్తగా అయిఉంటుంది.
* దానిని, ఉడికిన నీళ్ళు మిగిలాయి కదా , అందులో వేసి ఉప్పు, చక్కెర వేసి రెండు పొంగులు రానివ్వాలి.
* దించాక వేడి వేడిగా తీసుకుంటే బాగుంటుంది.


సూచన -- కార్న్ ఫ్లేక్స్ అని గరగరలాడుతూ ఉంటాయి, చక్కగా ఉప్పు కారం వేసి ఉంటాయి. వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సూప్ స్టిక్స్ అసలు నాకు నచ్చవు. కార్న్ ఫ్లేక్స్ అన్నానని కెల్లాగ్స్ కార్న్ ఫ్లేక్స్ అనుకునేరు. అవికాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు