సండిగి గొజ్జు
ఇది పులుసు మాదిరి ఉంటుంది. గొజ్జు అనేది కన్నడ ప్రభావం నుంచి వచ్చిన మాట. సండిగి అంటే కన్నడలో వడియాలని అర్థం. కానీ ఈ వంటకీ వడియాలకీ ఏ సంబంధం లేదు. మరి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలీదు. కానీ పేరు బాగుందని ఇలాగే పరిచయం చేస్తున్నాను.
ఈ పులుసులో కందిపప్పు బాల్స్ తేలుతూ చూడడానికి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అన్నంలో కలుపుకొని తినేప్పుడు అవి చిదుముకొని కలుపుకుంటే ఆహా.. ఏమి రుచి అనాల్సిందే.
కావలసిన పదార్థాలు:
కందిపప్పు (ఓ పిడికెడు తీసుకుని చూడండి ముందు)
ఎండుకొబ్బరి ఓ రెండు చెంచాలు *
పచ్చిమిర్చి ఓ రెండు * అన్నీ ఉజ్జాయింపుగా చెప్పాను సుమా!
జీలకర్ర ఓ చెంచా *
ఉప్పు తగినంత *
కారప్పొడి తగినంత
చింతపండు గంగరేగు పండంత *
పోపు దినుసులు
నూనె ఓ రెండు చెంచాలు
అంతే!
చేసే పద్ధతి:
ముందుగా కందిపప్పును బరకబరకగా మిక్సీలో వేసుకోవాలి.
తరువాత విడిగా
ఎండుకొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు మెత్తగా నూరుకోవాలి.
ఈ మిశ్రమాన్ని, కందిపప్పు పొడిని తగుమాత్రం నీరు వేస్తూ ఉండలు (బాల్స్) కట్టాలి.
గిన్నెలో పోపు (అనగా నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి,కరివేపాకు, పసుపు )
వేసి తగినన్ని నీళ్ళు పోసి (ఓ పెద్ద గ్లాసుడు) మరగనివ్వాలి.
నీళ్ళలో ఒక్కొక్క ఉండ నెమ్మదిగా వదలాలి.
ఉండలు ఉడికాక చింత పులుసు పిండాలి.
ఉప్పు, కారప్పొడి వేయాలి.
పైన ఇంగువ పోపు పెడితే బావుంటుంది.
* ఉండలు ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే ఒక చెంచాతో ఒక ఉండ పైకి తీసుకుని తాకి చూడాలి ఉడికితే చేతికి అంటుకోదు.
* చింత పులుసులో కందిపప్పు పొడి ఉండలు కట్టగా మిగిలింది కలిపి వేస్తే చక్కగా ఉంటుంది. అది లేకపోతే కాస్త బియ్యప్పిండి కలిపి వేస్తే సరి.(ఉండలు ఉడికాక మాత్రమే)
8, డిసెంబర్ 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ప్రముఖ పోస్ట్లు
-
మా ఊరి వైపు మరమరాలని బొరుగులని అంటాం. అందుకే అలా రాశాను. దీన్ని బొరుగుల తిరగవాత అనీ, ఉగ్గాణి అనీ అంటారు. ఆఫీసుకు వెళ్ళే తొందర లో ఉండే వాళ్లక...
-
కొన్ని కొన్ని భలే జంట కుదురుతాయి. అలాగే మెంతికూర , వంకాయ కూడా. ఇవి రెండూ కలిపి పప్పు చేస్తే చాలాబాగుంటుంది. మెంతికూర కూడా పచ్చిది కావాలన...
-
ఈ పులుసు మా అమ్మ స్పెషల్. చాలా త్వరగా చేయొచ్చు. పైగా ఎంతో రుచిగా ఉంటుంది. ఆ మాట మేం చెప్పాలి అంటారా? సరే, తప్పకుండా చెపుతారని నాకు తెలుసు.ల...
-
పాలకూర చెట్నీ (చివరాఖరికి బల్బ్ వెలిగింది!! పాత ఎడిటర్ కు మారిపోయాను. ఇప్పుడు టపా వేయగలిగాను.) కావలసిన పదార్థాలు పాలకూర ~ ఒక కట్ట ఉల్లిగడ...
-
వంకాయ పచ్చడి వంకాయ వంటి కూరయు.... అని పద్యాల్లో వినుతికెక్కిన వంకాయతో ఏవంట చేసినా అమోఘంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకని ఇప్పుడు వంకాయ...
-
మా సీమలో దోసకాయ అంటారు కానీ కొందరు కీర దోసకాయ అంటారనుకుంటా. అంటే చూడటానికి ఆకుపచ్చని గీతలో లేతాకుపచ్చ రంగులో బీరకాయకు తోబుట్టువు లాగా ఉంటు...
-
పచ్చికొబ్బరి కూర ఇప్పుడే పాకవేదం లో చూశాను. కొబ్బరికూర గురించి. మేమింకో విధంగా చేస్తాం కదా సరే రాద్దాం అనిపించింది. ఇది చాలా రుచిగా ఉంటు...
-
ఈ పేరు చూసి ఏమబ్బా ఇలా ఉంది అనుకుంటున్నారేమో. మా అవ్వ (నాన్నమ్మ) ఇలాగే అనేది. మా వూళ్ళో ఈ కూరకి ఇదే పేరు. మాండలీకాల్లో ఉన్న సొగసే వేరు. ఆ క...
-
ఉగాది పచ్చడి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. మేము చేసే ఉగాది పచ్చడి ఏమాత్రం భయపెట్టేదిగా ఉండదు. అదేంటో ఉగాది అనగానే ఎందుకలా కార్టూన్ లు వచ...
-
కావలసిన వస్తువులు: ౧.బొంబాయిరవ ఒక గిన్నె ౨.పచ్చికొబ్బెర ఒక గిన్నె ౩.చక్కెర రెండు గిన్నెలు ౪.నెయ్యి సగం గిన్న...
tumbaa chennaagi ide sandige gojju :)
రిప్లయితొలగించండిoh! nimage mumde gottideyaa!!
రిప్లయితొలగించండి