Loading...

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, జులై 2020, మంగళవారం

పెసర ఉంటలు











ఎక్కువ పదార్థాలు అవసరం లేకుండా, ఎక్కువ సమయం తీసుకోకుండా, తొందరగా తయారై, చక్కటి రుచితో ఉండే తీపి తినుబండారం పెసర ఉంటలు.


తయారుచేయడానికి కావలసినవి.
-
పెసరపప్పు
బెల్లము
నెయ్యి 
జీడిపప్పు పలుకులు

తయారు చేసే విధానం
-
ముందుగా బాణలి స్టౌ మీద పెట్టి పెసరపప్పు ఎంత కావాలో కొలిచి వేసి, నెమ్మదిగా పెసరపప్పు మాడిపోకుండా, మంట మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఉంచుతూ వేయించుకోవాలి.
రంగు మారి కమ్మని వాసన వచ్చేదాకా వేయిస్తుండాలి.
వేగిన పెసరపప్పుని పక్కకు తీసి చల్లారనివ్వాలి.
మిక్సీ లో వేసి కొంచెం బరకగా పొడి చేసుకోవాలి.
అప్పుడు బెల్లము తగినంత (అంటే ఎక్కువ తీపి కావాలనుకుంటే పెసరపప్పు కొలతకు ఎక్కువగానే బెల్లము తీసుకోవాలి. లేదంటే సమానంగానా, పెసరపప్పు కన్నా తక్కువ తీసుకోవాలా అనేది తమ తమ రుచిని బట్టి నిర్ణయించుకోవచ్చు ) బరకగా నలిగిన పెసరపప్పులో వేసి మళ్ళీ మిక్సీ తిప్పాలి.
మిక్సీలోంచి తీసి ఒక గిన్నెలో వేసుకొని కరిగించిన నెయ్యి పోస్తూ కలపాలి.
ఉండ కట్టేంత సౌలభ్యం వచ్చేవరకూ నెయ్యి పోస్తే చాలు.
తక్కువైతే ఇంకో రెండు మూడు చెంచాల నెయ్యి కలుపుకొని లడ్డులు మనక్కావలసిన ఆకారంలో కట్టుకోవచ్చు.
--
గమనిక - పెసరపప్పు మరీ నూక గా కానీ, మరీ మైదా అంత మెత్తగా కానీ పిండి పట్టకూడదు.



చిత్రంలోని అంశాలు: ఆహారం









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు