ఇది కొత్తగా నేను కనిపెట్టిన వంటకమేమీ కాదు, పేరును చూసి కొత్తదనుకునేరు!
పేరు మాత్రం నేను పెట్టానన్నమాట.
కావలసిన పదార్థాలు ----
శనగపిండి - ఒకటి (ఎంత గిన్నె వంటివన్నీ ఎవరికి వారే నిర్ణయించుకోవాలి)
చక్కెర - రెండు
కొబ్బెర - 3/4 వంతు (ఒకటి లో)
నెయ్యి - ఒకటి
పాలు - ఒకటి
తయారు చేసే పద్ధతి ---
మొదట తాజా శనగపిండిని జల్లించుకొని బాణట్లో మంచి వాసన వచ్చేవరకూ వేయించుకోవాలి. (నూనె, నెయ్యి అక్కర్లేదు)
తర్వాత అందులోనే పాలు, నెయ్యి, చక్కెర, కొబ్బెర తురుము వేసేసి గరిటతో కలుపుతూ తిప్పుతూ ఉండాలి.
అవసరాన్ని బట్టి ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. కానీ ఇదే సరిపోతుంది.
మిశ్రమం (మామూలుగా మైసూర్ పాక్ లా) దగ్గరపడ్డాక ఏలకుల పొడి వేసి, మళ్ళీ బాగా తిప్పి నెయ్యి రాసిన కంచంలో గానీ, ట్రే లో గానీ వంపాలి. రెండు నిముషాల్లోనే కొద్దిగా గట్టిపడుతుంటుంది. ఈలోగా పలకలుగా కోసి పెట్టుకుంటే సరిపోతుంది. రుచి చాలా బాగుంటుంది. చేయడం సులభంగా అయిపోతుంది.
దీన్ని అందరూ సెవెన్ కప్స్ అంటారు. అసలు సెవెన్ లేవు, పైగా ఆ పేరులో 'రుచి'రంగా నూ లేదు. అందుకే నేను శనగ పలకలు అని పేరు పెట్టాను. 😎
గమనికలు -- మొదట్నించీ చివరివరకూ స్టౌ సిమ్ లో ఉంచి ఓపిగ్గా చేసుకోవాలి.
జీడిపప్పులు, బాదంపప్పులు ముక్కలుగా వేసుకోవచ్చు. పొడిగా వేసుకోవచ్చు.

పేరు గుర్తులేదుకాని, అమ్మ చేసి పెట్టేది. చి న
రిప్లయితొలగించండి😊 అమ్మ చేసినవి అన్నీ ఎంత బాగుంటాయో,ఎవరికైనా సరే.
రిప్లయితొలగించండి